Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఝార్ఖండ్‌లో బీజేపీ చేతికి అధికారం: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

BJP Win Clear Mandate In Jharkhand says exit poll predictions
Advertisement
  • బీజేపీ 40కి పైగా సీట్లు గెలుచుకోవచ్చునని అంచనాలు
  • కాంగ్రెస్ కూటమి 40 సీట్ల లోపు గెలుచుకోవచ్చునని అంచనాలు
  • 1 నుంచి 10 సీట్లు ఇతరులు గెలిచే అవకాశముందన్న ఎగ్జిట్ పోల్స్
Advertisement
ఝార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈరోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని, జేఎంఎం కూటమి సీట్లు భారీగా తగ్గే అవకాశముందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇతరులు 1 నుంచి 10 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి.

పీపుల్స్ పల్స్ - బీజేపీ కూటమి: 46 నుంచి 58, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 24 నుంచి 37
మ్యాట్రిజ్ - బీజేపీ కూటమి: 42 నుంచి 47, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 25 నుంచి 30
చాణక్య - బీజేపీ కూటమి: 45 నుంచి 50, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 35 నుంచి 38
టైమ్స్ నౌ-జేవీసీ - బీజేపీ కూటమి: 40 నుంచి 44, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 20 నుంచి 40
యాక్సిస్ మై ఇండియా - బీజేపీ కూటమి 25, ఇండియా కూటమి 53
దైనిక్ భాస్కర్ - బీజేపీ కూటమి: 37 నుంచి 40, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 36 నుంచి 39
Advertisement
Advertisement
Jhardkhand
Assembly Elections
Vote Counting
Exit Poll

More Telugu News